Krishna Vrinda Vihari Movie Telugu Review

Posted by Fernande Dalal on Thursday, August 22, 2024

2.5/5

2 Hrs 19 Mins   |   Family   |   23-09-2022

Cast - Naga Shaurya, Shirley Setia, Radhika and others

Director - Anish R. Krishna

Producer - Usha Mulpuri

Banner - Ira Creations

Music - Mahathi Swara Sagar

ఏదో ఒక్క కొత్త పాయింట్..సరైన ట్విస్ట్ వుంటేనే సినిమాకు, కథకు నిండు దనం తీసుకువస్తాయి. అలాంటి కొత్త పాయింట్ వున్న కథల కోసమే అటు ఇండస్ట్రీ, ఇటు జనాలు చూస్తున్నారు. ఈవారం విడుదలైన కృష్ణ వృింద విహారి కూడా ఇలాంటి డిఫరెంట్ పాయింట్ తో అల్లుకున్న కథతో వచ్చిన సినిమానే. అయితే దేనికైనా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఈ డిఫరెంట్ పాయింట్ కు దర్శకుడి టేకింగ్ తోడయిందా? లేదా అన్నదే అసలు వ్యవహారం. ఈ సినిమాకు దర్శకుడి స్టామినా అంతగా సరిపోలేదు అన్నదే సిసలు ట్విస్ట్.

ఇంతకీ ఈ కృష్ణ వ్రింద విహారి కథేంటీ…

కృష్ణ (నాగశౌర్య) ఓ అగ్రహారం కుర్రాడు. తల్లి (రాధిక)కి సంప్రదాయాలు, మడి..తడి ..ఆచారం. వ్యవహారాలు..ఇలా సవాలక్ష. పైగా తన చనిపోయిన తల్లి మళ్లీ మనవరాలిగా పుడుతుందనో బలమైన నమ్మకం. ఇలాంటి నేపథ్యంలో కృష్ణ హైదరాబాద్ వచ్చి ఓ అల్ట్రా మోడరన్ సాఫ్ట్ వేర్ అమ్మాయి వృింద (షెర్లియా) ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటే వృిందకు పిల్లలు పుట్టరనే సమస్య వుంటుంది. దాంతో తనకే అసలు పిల్లలు పుట్టరని ఇంట్లో అబద్దం చెప్పి కృష్ణ తన ప్రేమను నెగ్గించుకుని వ్రిందను పెళ్లి చేసుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏమిటంటే అనుకోకుండా వృింద గర్భవతి అవుతుంది. దాంతో కృష్ణ తల్లికి అనుమానం..ఈ గర్భానికి కారణం ఎవరా అని? పైగా కోడలి మోడరన్ పోకడలు నచ్చవు. దీంతో తల్లి..పెళ్లాం మధ్య నలిగిపోయే కృష్ణ..చివరకు ఏమైంది అన్నది మిగిలిన సినిమా.

నిజానికి కథలో పెనవేసిన ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకుని, సంప్రదాయం..అల్ట్రా మోడరన్ ల నడుమ కాన్ ఫిక్ట్ అల్లుకోవాలి అనుకునే వరకు బాగానే వుంది. కానీ ఆ ట్విస్ట్ ను బలంగా ప్రెజెంట్ చేయడం కానీ, కాన్ ఫ్లిక్ట్ నేపథ్యంలో బలమైన ఎమోషన్ సీన్లు రాసుకోవడంలో కానీ దర్శకుడు విజయం సాధించలేకపోయాడు. సినిమా తొలిసగం అలా అలా సాగిపోతుంది. పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలా అని అద్భుతమూ కాదు. అసలు వ్యవహారం అంతా మలిసగంలోనే వుంటుంది.

మలిసగం స్ఖ్రిప్ట్ రాసుకోవడంలో దర్శకుడికి స్టామినా సరిపోలేదు. అత్తా కోడళ్ల మధ్య సరైన సీన్లు రాసుకోలేకపోయాడు. ఒక విధంగా చూస్తే అత్తది తప్పు, అత్తే విలన్ అన్నట్లు తీసుకెళ్లిపోయాడు. కీలకమైన లాజిక్ ను మిస్ చేసాడు. అంతే కాదు, హీరోయిన్ తన భర్తకు దూరంగా వుండడం వరకు ఓకె, ఆ కోపంలో విలన్ కు దగ్గర కావడం, వాడితో రాసుకుపూసుకు తిరగడం అంటే ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అన్న సంగతి విస్మరించాడు. ఇలా దర్శకుడు చాలా తప్పులు చేసాడు. చాలా మిస్ అయ్యాడు. కానీ దర్శకుడు రాసుకున్న కామెడీ ఎపిసోడ్ లు సినిమాను కాపాడాయి. సినిమాను చూడగలిగేలా చేసాయి. అవి కూడా లేకుండా వుంటే సినిమా సంతకెళ్లిపోయేది.

అసలు కొడుక్కు అసలు విషయం చెప్పలేక తల్లి, అత్తగారు అలా ఎందుకు వుందో తెలియక కోడలు, అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోందో తెలియక కొడుకు సతమతం కావడం, అందరి నడుమ తలో సరైన సీన్ ప్లాన్ చేసుకుని వుంటే వేరుగా వుండేది. అసలు హీరోయిన్ గర్భవతి అన్న విషయం అత్తగారికి చెప్పిన డాక్టర్, అసలు చెప్పాల్సిన వారికి చెప్పకపోవడం లాజిక్ మిస్ కాక మరేంటీ? అత్తగారికి, కోడలికి కూడా రియలైజేషన్ సీన్లు కూడా బలంగా లేవు. అయితే దర్శకుడు చేసుకున్న మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే నెరేషన్ ఏమంత గజిబిజిగా వుండదు. అలా అలా సాదా సీదాగా సాగిపోతుంది. మెదడుకు పని పెట్టదు.

ఎప్పుడైతే సినిమా కలర్ ఫుల్ గా మంచి కాస్టింగ్ తో వుందో, రెండు పాటలు బాగున్నాయో, వాటి చిత్రీకరణ బాగుందో, ఫన్ సీన్లు పండాయో, ముఖ్యంగా సినిమాను ఫన్ సీన్ తో ఎప్పుడయితే ఎండ్ చేసారో, సినిమా థియేటర్ లో సగటు మార్కులతో పాస్ అయిపోయింది.

ఇలాంటి సినిమాను నాగశౌర్య చాలా సులువుగా లాక్కు వెళ్లిపోయాడు. షెర్లీ రొమాంటిక్ సీన్లో బాగుంది. రాధిక పాత్రను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ సినిమాను నిలబెట్టారు.

టెక్నికల్ గా సినిమా రిచ్ కా వుంది. సినిమాటోగ్రఫీ, పాటలు, నేపథ్యసంగీతం, లొకేషన్లు అన్నీ ఫిట్ గా సరిపోయాయి.

టోటల్ గా చూసుకుంటే వారానికి ఓ సినిమా చూడాలనుకున్నవారికి ఈవారం ఇదే సినిమా. ఓటిటి వరకు వెయిట్ చేయాలనుకునేవారికీ ఇదే సినిమా.

ప్లస్ పాయింట్లు

ప్రొడక్షన్ వాల్యూస్

పాటలు

ఫన్

మైనస్ పాయింట్లు

తొలిసగం

సరైన ఎమోషన్లు లే్కపోవడం

ఫినిషింగ్ టచ్: నో విహారం…ఓన్లీ కృష్ణ..వ్రింద

Rating: 2.5/5

ncG1vNJzZmislaHCqMGNoKylrJVjsLC5jqamr6GVYr%2BmwsierqxnZG6Cd4WOpKmiq5ijrm7C0aKlnZldq7aprdGiZKanpp6ybsDEpaygrV2nsre1xLA%3D